calender_icon.png 11 October, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు వరం పోషణ్ అభియాన్

10-10-2025 10:27:45 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాల ద్వారా చేపట్టే పోషణ అభియన్ కార్యక్రమం పేదలకు వరం లాంటిదని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషారాణి అన్నారు. శుక్రవారం మరిపెడ మండలం ఎల్లంపేట సెక్టార్ లోనీ అనేపురం కుడియ తండా అంగన్వాడి సెంటర్, సొమ్ల తండా అంగన్వాడి సెంటర్ల నందు పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషారాణి నిర్వహించారు.

పోషణ మాస కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... పౌష్టికార లోపంతో గర్భిణులు చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 16 వరకు మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గర్భిణీల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పోషణ లోపం వల్ల ఇబ్బందులు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై మహిళలకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవడంతో పాటు వాటి వల్ల కలిగే లాభాలను మహిళలకు వివరించారు. అనంతరం పోషణ్ అభియాన్ మాస ఉత్సవాల షెడ్లు విడుదల చేశారు.