10-10-2025 11:03:30 PM
కోదాడ: జిల్లా గ్రంధాలయం, షాదీ ఖానా, ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం తదితర అభివృధి పనుల పై సంబంధిత అధికారులతో శుక్రవారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ ల ప్లాన్లు & డ్రాయింగ్ మ్యాప్ లను పరిశీలించారు. కోదాడ నివాసం వద్ద ఏర్పాటు చేస్తున్న సమావేశం మందిరం పనులను పరిశీలించారు.
కోదాడ లో బెస్ట్ అవైల బుల్ స్కీమ్ క్రింద చదువుతున్న విద్యార్థుల ను స్కూల్ కి రానివ్వటం లేదని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కోదాడ లో తారా టీ స్టాల్ రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని తార టీ స్టాల్ యజమాని ఆహ్వానించారు. పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణరెడ్డి, గ్రంథాలయం చైర్మన్ వంగవేటి రామారావు, కమిషనర్ రమాదేవి, అధికారులు పాల్గొన్నారు.