calender_icon.png 11 October, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి

10-10-2025 11:01:07 PM

టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు 

జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): టియూడబ్ల్యూజే ఐజేయులో సభ్యత్వం పొందిన ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని టియూడబ్ల్యూజే ఐజేయు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల జగిత్యాల పట్టణ ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ లో జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టియూడబ్ల్యూజే  ఐజేయులో సభ్యత్వ నమోదు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు.

అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కు సభ్యత్వం కల్పిస్తామన్నారు. నవంబర్ 10 లోపు జిల్లాలో సభ్యత్వం పొందిన జర్నలిస్టులందరికీ ఐడి కార్డులు ఇవ్వనున్నట్టు వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు ప్రతి సభ్యుడు తోడ్పడాలని సూచించారు. ధర్మపురి, కోరుట్ల పట్టణాల్లోని ప్రెస్ క్లబ్ ల సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళామని, వారి ఆదేశాల మేరకు స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ఉప కమిటీలను త్వరలోనే ఎన్నుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన లోక రమణా రెడ్డిని జిల్లా ఉపాధ్యక్షునిగా నియమిస్తూ కమిటీ తీర్మాణించింది.