calender_icon.png 10 October, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెడు ఆలోచనలు రానివ్వద్దు

10-10-2025 05:57:32 PM

సిద్దిపేట క్రైం: చదువుకునే వయసులో చెడు ఆలోచనలకు తావియ్యకూడదని టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం స్థానిక కాకతీయ టెక్నో స్కూల్ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్ అండ్ బాడ్ టచ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, ఈవ్ టీజింగ్  తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసరమైన మేరకు మాత్రమే సోషల్ మీడియా ఉపయోగించాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులు ఓపెన్ చేయవద్దన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. షీటీమ్ విధులు, ఫోక్సో, బాల్య వివాహాల పరిణామాల గురించి వివరించారు.