07-10-2025 12:00:00 AM
గాంధారి అక్టోబర్ 6 (విజయ క్రాంతి): గాంధారి గ్రామ నూతన విలేజ్ కమిటీ ని సోమవారం రోజున ఏకగ్రీవంగా గ్రామ పెద్దలు గ్రామస్తుల సమక్షంలో ఎన్నుకు న్నారు. ఈ మేరకు స్థానిక భోగేశ్వర ఆల యంలో సమావేశమైన గ్రామస్తులు గాం ధారి గ్రామ నూతన కమిటీ అధ్యక్షునిగా ఆకుల రామస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు.
కార్యదర్శిగా చందాపురం రవీందర్ గౌడ్ ను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా లైన్ రమేష్, ఏ సురేష్, చాకలి మోహన్ బొమ్మని సాయిలు కోశాధికారిగా దర్భాస్తు రవి, సహాయ కార్యదర్శులుగా కమ్మరి సురేష్, మంగలి సాయిలు, బెస్త సత్యనారాయణ, కుమ్మరి కిష్టయ్య, కటికే విజయ్, గంగి రమేష్, గడ శంకర్, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రామస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంతటి పెద్ద బాధ్యతను నాకు అప్పజెప్పినందుకు గ్రామస్తులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ అభివృద్ధి కొరకు పాటు పడతానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీని గ్రామస్తులు శాలువాలతో సన్మానించి సత్కరించారు.