calender_icon.png 7 October, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు తీర్పుపైనే ఆశలు

07-10-2025 12:00:00 AM

  1. సుప్రీంకోర్టులో సర్కార్ కు ఊరట
  2. ఎన్నికలు సజావుగా నడిచేనా..?
  3. గ్రామాలలో చర్చ... ఆశావహుల్లో ఆందోళన 
  4. టికెట్లపై ...టెన్షన్... ఎవరికి వరించునో

నకిరేకల్,  అక్టోబర్ 5: స్థానిక సంస్థల ఎన్నికలపై సోమవారం  సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ అంశంపై సర్కార్ కు ఊరట కల్పించింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం. 9ని సవాలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా గోపాల్రెడ్డి ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు ఇవాళ ఆ పిటిష్ప జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షావాదనలు విన్న న్యాయమూర్తులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గోపాల్ రెడ్డి దాఖలైన పిటిషన్ను తిరస్కరించారు. ఓ వైపు హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు తెలుపగా.. అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా..? అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసులో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి తరఫు లాయర్కు సుప్రీం కోర్టు సూచించింది.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా.. దీనిపై హైకోర్టు ఏం చెబుతుందనే దానిపైనే అందరి చూపు నెలకొంది.లోకల్ బాడీ ఎన్నికలపై సస్పెన్స్ మరింతగా పెరిగింది. ఈ అంశంపై న్యాయస్థానాలు ఏం చెబుతాయి..? ఎన్నికలు జరుగుతాయా.? లేదా.? అనే ఉత్కంఠ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.

గ్రామాలలో ,పట్టణాల్లో తీవ్రంగా చర్చ కొనసాగుతోంది హైకోర్టు  ఎన్నికలపై ఏం నిర్ణయం తీసుకోబోతున్న ఉత్కంఠ నెలకొంది ఆశావుల్లో ఆందోళన మొదలైంది కంటిమీద కొనుక్కు కరువైంది. మరో వైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8వ తేదీన తిరిగి విచారణ జరపనుంది. ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో  హైకోర్టులో  ఈ అంశం చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

దీంతో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ 9 విషయంలో హైకోర్టు ఏం చెప్పబోతున్నాయి? జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే  సుప్రీంకోర్టులో సర్కారుకు ఊరట కల్పించగా హైకోర్టులో కేసు విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశావహులు ఉత్కంఠతో మారింది.. అయినా ఏ విధంగానైనా  కోర్టు తీర్పు అనుకూలంగా రానిఎడల పార్ట్ బి ఉపయోగించైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో కి వెళ్లాలని దృఢ సంకల్పతో ఉన్నట్లు చర్చ జరుగుతుంది.

ఇప్పటికే గ్రామాల్లో పట్టణాలలో అభివృద్ధి ,పాలన అంతా కుంటుపడింది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే అధికారులతో, మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి కోర్టు తీర్పు తదనంతరం ఏం చర్యలు  తీసుకుంటే బాగుంటుందో అని సమాలోచన చేస్తుంది.  పది, పదిహేను రోజులు సమయం గ్యాప్ వచ్చిన  ఏది ఏమైనా ఎన్నికలు జరుగుతాయని ప్రచారం మాత్రం ఊపుందుకున్నది.

దీనితో ఆశావహుల్లో ఆశలు పెరిగాయి. ఖ్చనా సరే ఈసారి పోటీలో ఉండాల్సిందని చర్చ మొదలైంది దసరా పండుగ వేదిక చెసుకొని ఖదర్ బట్టలు ధరించి పలకరింపులు మొదలుపెట్టి మేము పోటీలో ఉన్నామని సంకేతాలు విడుదల చేస్తున్నారు.ఆశావహులు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో టికెట్ల కోసం పైరవీలు మొదలుపెట్టారు. సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

 కాంగ్రెస్‌లో టికెట్ల కలవరం

నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లో టికెట్ కలవరం మొదలైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. పాత కాంగ్రెస్ నాయకులకా..కొత్త కాంగ్రెస్ నాయకులకు.. ఎవ్వరికీ టికెట్లు దక్కుతానే అనుమానాలు  ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఒక వర్గం మాకే టికెట్లు దక్కుతున్నాయని సంకలు  గుద్దుకుంటుంటే మరో వర్గం ఫస్ట్ నుండి పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం కష్టపడ్డాం మాకుడా టికెట్లు ఇవ్వాలని కోరినట్లు చర్చ జరుగుతోంది.

ప్రతి గ్రామంలో ,ప్రతి మండలంలో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ జడ్పిటిసి పోటీలకు 5 ,6 మంది ఆశావహులు పోటీ పడుతున్నట్లు చర్చ జరుగుతుంది. ఏపదవుల్లోనైనా చెరొకటి ఇవ్వాలని  నాయకత్వాన్ని  కోరుతున్నట్లు విశ్వనీయ సమాచారం. పాత వర్గం కొత్త వర్గం అనేది ఏమీ లేదు ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఒకటైనని ఆలోచనలు మానుకోవాలని  నాయకత్వం తెలిసి చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

టికెట్ల విషయంలో బలాలు, బలహీనతలు, బెరిచేసుకోని చేసుకుని గెలుపు గుర్రాలకే, పెట్టుబడి పెట్టే వాళ్ళకి టికెట్లు అందుతాయని చర్చ జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. టికెట్లు ఎవరికి దక్కుతాయి. అందరూ కలిసి పని చేస్తారా. ఏమైనా అనుమానాలకు తావిస్తారా. అని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపై నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాల్సిందే. 

 బీఆర్‌ఎస్ బలపడేలానా

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ బలపడుతుందా లేక బలహీనపడుంతా అనే చర్చ జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండ కడుతు  ప్రజల్లోకి తీసుకపోవటంలో వైఫల్యం చెందిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ అంతర్గత విభేదాలతో నాయకత్వం మీద  కార్యకర్తలు విశ్వాసం కోల్పోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా నాయకులు ఉండిపోవటం వల్ల కార్యకర్తలకు అండదండలు కరువేయ్యాని కార్యకర్తలు వాపోతున్నారు..

ఒంటరిగా పోటీ చేస్తుందా కలిసి వచ్చే శక్తులతో కలిసి పనిచేస్తుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికల్లో  బిఆర్‌ఎస్ గెలిచిన నిలకడగా ఉంటుందా అధికార పార్టీలో చేరుతుందాఅనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ రాజకీయ అనరంగంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో వేచి చూడాల్సిందే.

 కామ్రేడ్లు పట్టు సాధించెనా

నకిరేకల్ నియోజకవర్గం లో కామ్రేడ్లకు కంచుకోటగా అనేక గ్రామాలుఉన్నాయి ప్రదానంగా సిపిఎం కు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో బలమైన ఓటు బ్యాంకు సిపిఎం కలిగి ఉన్నది. గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి ఆపార్టీకి ఉన్నది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కామ్రేడ్లు పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కలిసి శక్తులతో పనిచేస్తాం లేక ఒంటరిగా పోటీ  చేయటానికైనా సిద్ధం అంటుంది

ఆ పార్టీ. ఎన్నికల ఎత్తుగడలో పై పార్టీ నిర్ణయాల ప్రకారం ముందుకెళ్తామని  పార్టీ వర్గాలు తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో శాఖ సమావేశాలు మండల కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలు నాయకులను అప్రమత్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో  బలమున్న చోట పోటీ చేసి తన ప్రాబల్యాన్ని సీట్ల రూపంలో సాధించేందుకు .ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేందుకు కామ్రేడ్లు, సిపిఎం ప్రయత్నం చేస్తుంది.

 బీజేపీ బలమెంత..? 

కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న నకిరేకల్ నియోజకవర్గంలో నామ మాత్రమే ఉందని చెప్పుకోవచ్చుని విశ్లేషకులు అంటున్నారు. స్థానిక సంస్థలు పోటీ చేస్తుందా ఏ మేరకు సాధిస్తుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుందా అనే చర్చ కొనసాగుతుంది. ఇది ఏమైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ చందరంగంలో ప్రజలు ఎవరికి తీర్పు ఇవ్వబోతున్నారో  వేచి చూడాల్సిందే.