calender_icon.png 7 October, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు జరగాలి

07-10-2025 12:00:00 AM

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 

జనగామ, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని  కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. వానాకాలం( ఖరీఫ్)  పంట కొనుగోలు కు  సంబందించి ఆర్డీఓ, సివిల్ సప్ప్లై, డిఆర్డీ ఓ, మార్కెటింగ్, మార్కుఫెడ్, జిల్లా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయ శాఖ  అధికారులు, ఆర్టీఓ, గన్ని గోదాం ఇంచార్జి లు, రైస్ మిల్లర్ల  అసోసియేషన్ ప్రసిడెంట్‌లతో సోమవారం కలెక్టరెట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్షా సమావేశాన్ని నిర్వహిం చారు. 

ఖరీఫ్ 2025-26 సంవత్సరంకి సంబందించి జిల్లాలో  2,13,978 ఎకరాల్లో వరి పంట సాగు అయ్యిందని, 5,43,057 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా కాగా 2,05,057 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కి వస్తుందని అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు. సన్న రకం క్వింటాలుకు మద్దతు ధర 2,389 రూపాయలు కాగా, బోనస్‌గా రూ. 500 చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే దొడ్డు రకం కి 2,369 రూపాయల మద్దతు ధర ఉందన్నారు. దొడ్డురకం ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ 116, సొసైటీ 82 కేంద్రాలను, అలాగే సన్నరకం ధాన్యం కొనుగోలు కై 69 ఐకే పీ, 42 సొసైటీ సెంట ర్‌లను  ఏర్పాటు చేసేందుకు అన్ని చర్య లు తీసుకున్నమ న్నారు.  వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవ కుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.