calender_icon.png 18 December, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలతోనే కాంగ్రెస్ సర్పంచ్‌లు గెలుపొందుతున్నారు

18-12-2025 12:01:02 AM

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మోత్కుపల్లి రాములు

మొయినాబాద్, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అధిక స్థానంలో గెలుపొందుతూ ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంలో ఉన్నారని రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మోత్కుపల్లి రాములు అన్నారు. బుధవారం మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచిగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపూర్ణ రాములును వివిధ గ్రామాల నుంచి గెలుపొందిన సర్పంచులు అభిమానులు నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆమెను సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు రాములు పాల్గొని సర్పంచిని అభినందిస్తూ సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే సర్పంచుల గెలుపుకు నినాదమని సూచించారు. వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థలు ఘన విజయం సాధిస్తారని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాగుతుందని ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిగూడా సుజాత, సునీల్, తదితరులు పాల్గొన్నారు.