9 April, 2026 | 5:10 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

02-12-2025 12:37 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

మోతె, డిసెంబర్ 1: ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రంను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల అధికారి టి. ఆంజనేయులు, తహసీల్దార్ యం. వెంకన్న లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం యం పి డి ఓ కార్యాలయంలో  సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మామిళ్ళ గూడెం నామినేషన్ కేంద్రంను పరిశీలన చేశారు. మండలంలోని పలు క్లస్టర్ లలో నామినేషన్ల పై వివరాలు అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు నింపే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి విషయంలో అధికారులు సమయస్ఫూర్తి తో ఉండాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఈయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.