calender_icon.png 23 November, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలి

23-11-2025 11:12:26 PM

లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం..

తెలంగాణ బిసి సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ స్థానిక సంస్ధలకు ఎన్నికలు జరపాలని తెలంగాణ బిసి సంఘాల జేఏసీ ఛైర్మన్ ఓరుగంటి వెంటకేష్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెం. 46ను ఉపసంహరించుకోవాలని అన్నారు. లేనిపక్షంలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరనన ప్రదర్శనలు, దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్  ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిసి రిజర్వేషన్లపై హైకోర్టులో సోమవారం వాదనలు ఉన్నప్పటికి ప్రభుత్వం హడావిడిగా జీవో నెం.46 ను తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు ఎఐసిసి నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు గోప్పలు చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచినా 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎస్సీ, ఎస్సీ, బీసీ లకు కలిపి 50 శాతం లోపు రిజర్వేషన్ లతో ఎన్నికలు నిర్వహించడం బీసీలను నిలువునా మోనం చేయడమేనని ధ్వజమెత్తారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెన్, బిజెపి పార్టీలు కావాలని మోనం చేస్తున్నాయని, వచ్చే స్థానిక సంస్థల, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన బిసిలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిసి నేతలు కోలా జనార్ధన్, సారంగ అనిత గౌడ్, సోమేశ్వర్. సంగమేశ్వర్, రాములు తదితరులు పాల్గొన్నారు.