calender_icon.png 17 August, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిఎన్ఆర్ కాలనీ సందర్శించిన జిల్లా ఎస్పీ

17-08-2025 07:24:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సిద్దాపూర్ జిఎన్ఆర్ కాలనీ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదివారం సందర్శించారు. స్వర్ణ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ కాలనీ వరద ముంపు గురవుతున్నందున అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రజలకు అప్రమత్తతపై పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహకరించాలని అక్కడి కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సమయంలో పోలీస్ శాఖలు సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రవీణ్ కుమార్ గోవర్ధన్ రెడ్డి పట్టణ పోలీసులు ఉన్నారు