- ఏటా 6.17 శాతం వృద్ధి.. 20వ ఈపీఎస్ సర్వేలో వెల్లడి
- 2023 మార్చి నాటికి 15,751 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం
- 2031 నాటికి 1,20,549 మిలియన్ యూనిట్లు అవసరం
- గరిష్ఠ డిమాండ్ 27,059 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయ క్రాంతి): తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఏటా 6.17 శాతం వృద్ధి నమోదవుతుందని కేంద్ర విద్యుత్తు శాఖ అంచనా వేసింది. 2023 నుంచి 2031 మధ్య కాలంలో ఈ వృద్ధి ఉంటుందని తాజాగా సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీ (సీఈఏ)ఆధ్వర్యంలో చేసిన 20వ ఈపీఎస్ సర్వేలో స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని కూడా ఎలా పెంచుకోవాలనేదానిపై సర్వేలో పొందుపర్చారు.
ఈపీఎస్ సర్వేలోని విశేషాలు..
- ప్రస్తుతం (2023 మార్చి ౩1 నాటికి) తెలంగాణలో 15,751 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. ఇందులో 48 శాతం థర్మల్, మరో 52 శాతం న్యూక్లియర్, బయోమాస్, హైడ్రో, విండ్, సోలార్ విద్యుత్తు ద్వారా ఉత్పత్తి అవుతుంది.
- 2031 నాటికి రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 27,౦59 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉంది.
- 2023 రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 77,503 మిలియన్ యూనిట్లు ఉండగా.. 2031 నాటికి 1,20,549 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.
- ఏటా సగటున 6.17 శాతంతో విద్యుత్ వినియోగం వృద్ధి నమోదవుతుంది.
- డిమాండ్‌ను అందుకోవాలంటే.. 2029 నాటికి పవన విద్యుత్తు ద్వారా అదనంగా 7,701 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్తు ద్వారా 3,129 మిలియన్ యూనిట్లు, ఇతర మార్గాల ద్వారా 37,253 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయడం లేదా సమీకరించాలి.
- ప్రణాళికాబద్ధంగా స్థాపిత సామర్థ్యాన్ని పెంచుతూ పోయినా 2031 నాటికి సుమారు 7,027 మిలియన్ యూనిట్ల విద్యుత్తును అందించలేకపోవచ్చు.
- 2031 నాటికి డిమాండ్‌కు తగిన ట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే.. థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం 14,191 మెగావాట్లకు, సోలార్ విద్యుత్ 19,345 మెగావాట్లకు, పవన విద్యుత్తు 4,718 మెగావాట్లకు, జల విద్యుత్తు 4,102 మెగావాట్లకు చేరుకోవాలి.
- సౌర విద్యుదుత్పత్తిలో మంచి ప్రగతి సాధించడంతో 2031 నాటికి థర్మల్ విద్యుత్ పీఎల్‌ఎఫ్ 50.7 శాతం ఉండే అవకాశం ఉంది.
