calender_icon.png 13 July, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎన్టియూసి ఆర్జీ-1 జీఎం ఆఫీస్ పిట్ కమిటీ నియామకం

11-07-2025 09:35:15 PM

పిట్ సెక్రటరీగా జబ్బార్ మియా, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ గా శేషు కుమార్ నియామకం

నియామక పత్రాన్ని అందచేసిన యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్

రామగుండం,(విజయక్రాంతి): ఐఎన్టియూసి  ఆర్జీ-1 జీఎం ఆఫీస్ పిట్ కమిటీని గోదావరిఖని జనక్ భవన్ ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ కచకాయల సదానందం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీను ప్రకటించారు. పిట్ సెక్రటరీగా జబ్బార్ మియా, అసిస్టెంట్ పిట్ సెక్రటరీగా శేషు కుమార్ ను నియమించారు. 

ఈ నియామక పత్రాన్ని యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ సదర్భంగా జనక్ మాట్లాడుతూ... యూనియన్ బలపేతం కార్మికుల సంక్షేమం, హక్కుల సాధనకోసం కృషి చేయాలని కోరారు. అనంతరం పిట్ సెక్రటరీ, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు మాట్లాడుతూ వారి నియామకానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు .