27-12-2025 08:40:32 PM
వేలం పాట నిర్వహించిన అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు
ఉట్నూర్,(విజయక్రాంతి): జనవరి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే నాగోబా జాతర తైబజారుకు దేవాదాయ శాఖ అధికారులు, మెస్రం వంశస్థులు వేలం పాట నిర్వహించారు. శనివారం దర్బార్ హాల్లో నిర్వహించిన వేలం పాటలో తై బజార్ కు రూ. 7.50 లక్షలు, విద్యుత్ సౌకర్యానికి రూ.2.15 లక్షలు, పుట్నాలు పేలాలు విక్రయించుటకు రూ.52 వేలు, కొబ్బరి ముక్కలు జమ చేయుటకు రూ. 26 వేలు వేలం పాటలో ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు రమేష్, ఆలయ కార్యనిర్వహణ అధికారి ముక్త రవి, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, సర్పంచ్ మెస్రం తుకారాం తెలిపారు. గత ఏడాది జాతరలో వేలం పాట సందర్భంగా ఆలయానికి రూ.9.97 లక్షల ఆదాయం రాగా, ఈసారి జాతరకు రూ. 10.43 లక్షల ఆదాయం వచ్చిందని వారు తెలిపారు.