25 April, 2026 | 2:25 PM

Breaking News

‘జీరో బిల్లులు’ రావడం లేదు

02-07-2024 12:05 AM

కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామ పంచాయతీకి చెందిన రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు జీరో కరెంట్ బిల్లుల కోసం బారులు తీరుతున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తులు సమర్పించినా ‘జీరో బిల్లు రావడం లేదని’ వారు వాపోతున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప ఫలితం వుండటం లేదు. 200 యూనిట్లలోపు మీటర్ల వారికి జీరో బిల్లులు రావాలి. కానీ, ఇది ఆచరణలో అమలు కావడం లేదు. జీరో బిల్లులు కొందరికేనా? అర్హుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతున్నట్టు తెలిసింది. 

 -సింగు లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా