28-08-2025 01:40:16 PM
వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో మాట్లాడిన కేసీఆర్.
తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశం.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక సూచన.
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుండి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు కేసీఆన్ ఫోన్లు చేసి ఈ మేరకు అప్రమత్తం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వంతుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అధినేత కేసీఆర్ సూచించారు.