05-05-2025 10:41:56 PM
పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని చీదేళ్లకు చెందిన కాంగ్రెస్ నేత రణబోతు శ్రీనివాస్ రెడ్డి సోదరుడు కీ.శే. రణబోతు వెంకటరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి విచ్చేసి మృతుడు వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబానికి ఓదార్చారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వల్దాస్ దేవేందర్, తండు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పిల్లల రమేష్ నాయుడు, కర్ణాకర్ రెడ్డి, పెనపహాడ్ మండల నాయకులు బెల్లంకొండ శ్రీరాములు, గుర్రం అమృతారెడ్డి, యాట ఉపేందర్, కుందూరు వెంకటరెడ్డి, సుదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ముదిరెడ్డి రంగారెడ్డి, నగేష్ నాయక్, దాసరి మట్టయ్య, వాసా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.