05-05-2025 11:10:47 PM
కుత్బుల్లాపూర్ (విజయ క్రాంతి): అతను ఇంటీరియర్ పనుల్లో నైపుణ్యత కలిగిన వృత్తి కళాకారుడు. వృత్తితో పాటు ప్రవృత్తిగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేపడుతూ.. జల్సాలకు అలవాటు పడ్డాడు. రూ. రెండున్నర లక్షల బైక్, రూ. లక్షన్నర సెల్‌తో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎస్టిఎఫ్బి టీమ్ ఎస్సై బాలరాజు సిబ్బందితో కలిసి కుత్భుల్లాపూర్ శివారెడ్డి నగర్‌లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో షరీఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 1.360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ. లక్షల విలువ చేసే బైక్‌ను, సెల్ ఫోన్ ను, గంజాయిని ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించామని ఎస్సై బాలరాజు తెలిపారు. ఈ కేసులో అఖిల్ అనే వ్యక్తిపై కూడ కేసు నమోదు చేశారు.
మరో కేసులో ఎండిఎంఎ డ్రగ్స్ పట్టివేత..
గొల్కోండ టీఎస్‌ఎస్ పీడీసీఎల్ మారుతి లంగర్ హౌజ్ ప్రాంతంలో ఎస్టిఎఫ్బి టీమ్ నిర్వహించిన దాడుల్లో 5 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న మహ్మమద్ సులేమాన్ ను ఆతడి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు టీమ్ లీడర్ అంజి రెడ్డి తెలిపారు. ఈ కేసులో బెంగూళూరుకు చెందిన షకీల్‌పై కూడ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని, డ్రగ్స్‌ను గోల్కోండ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించామని తెలిపారు.