calender_icon.png 6 May, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతులు మెచ్చేలా.. చదువులు నచ్చేలా..

05-05-2025 10:54:23 PM

దోస్త్ నోటిఫికేషన్..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ ఆన్లైన్ నోటిఫికేషన్ వెలువడినట్లు కామారెడ్డి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ తెలిపారు. మూడు విడతలలో డిగ్రీలో ప్రవేశాలు జరుగుతాయని, జిల్లా హెల్ప్ లైన్ సెంటర్ ను కామారెడ్డి అటానమస్ కళాశాలలో జిల్లా విద్యార్థుల సౌకర్యార్థం దోస్త్ రిజిస్ట్రేషన్ లో ఏర్పడే సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమస్యలు, పరిష్కరించటానికి ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. 

హెల్ప్ లైన్ సెంటర్ కి చైర్మన్ గా ప్రిన్సిపల్ డాక్టర్ కే. విజయ్ కుమార్ వ్యవహరించినుండగా, కోఆర్డినేటర్ గా డాక్టర్. పి.విశ్వప్రసాద్, సహాయకులుగా అనిల్ కృష్ణ, మహమ్మద్ అజారుద్దీన్ ఉంటారని తెలిపారు. ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సంబంధించిన సమస్యలు,మార్కుల మెమో, చరవాణి నెంబర్లు  తదితర  వాటిలో ఏర్పడిన సమస్యలను గ్రీన్ ఛానల్ ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. 

వసతులు మెచ్చేలా చదువులు నచ్చేలా కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల కలల సౌధం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల 1964లో రైతులు, ప్రజలు విరాళాలతో 150 ఎకరాలకు పైగా సొంత భూమి కలిగి ఆరు దశాబ్దాలుగా విద్యా సేవలు అందిస్తూ, న్యాక్ 'ఏ' గ్రేడ్ 3.22 జిపిఏతో స్వయం ప్రతిపత్తి హోదా పొంది, మినీ యూనివర్సిటీగా విరాజిల్లుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ, పీజీ  కళాశాలలో ఉత్తమ ర్యాంకింగ్ సాధించి అపారమైన బోధన అనుభవం కలిగిన అధ్యాపకులు, బోధనలో సాంకేతికత, డిజిటల్ క్లాసులు ఆరు దశాబ్దాలుగా బహుముఖ విద్యాసేవ చేస్తూ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్-1 అధికారులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఆర్మీ, పోలీసులుగా, టీచర్లుగా పారిశ్రామికవేత్తలుగా అందించిన కళాశాల. 150 ఎకరాల విశాలమైన క్యాంపస్, ఆధునిక సౌకర్యాలు, అపారమైన బోధనా అనుభవం కలిగిన అధ్యాపకులు, వినూత్నమైన యూజీ, పీజీ కోర్సులు 

యూజీలో: బీఎస్సీ, బిజెడ్ సి, బీఎఫ్సీ, జెడ్ ఎఫ్ సి, ఎంపీసీ, ఎంపీసీఎస్, బిఎస్సి హానర్స్, బిఏ బీకాం, బి బి ఏ కోర్సులు

పీజీలో: ఎం.కామ్, ఎమ్మెస్ డబ్ల్యూ 

ఎంఏ: తెలుగు, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, 

ఎంఎస్సీ: బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, ఫిషరీస్ 

అత్యాధునిక సౌకర్యాలు

-విభిన్న సబ్జెక్టులకు సంబంధించి 30 వేలకు పైచిలుకు పుస్తకాలతో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోనే ప్రఖ్యాతి గాంచిన అతిపెద్ద గ్రంథాలయం

-ఇంటర్నెట్ సౌకర్యంతో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ లు 

-భౌతిక, రసాయన, వృక్ష జంతు శాస్త్రాల్లో పీజీ స్థాయికి సరిపడా అన్ని వసతులతో కూడిన విశాలమైన ప్రయోగశాలలు ఈ కళాశాల సొంతం.

-సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ రంగాలలో ఉద్యోగాలు పొందటానికి అవసరమయ్యే ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్,అనలైటికల్ స్కిల్స్ లో టాస్క్ ద్వారా ప్రత్యేక శిక్షణ 

-విద్యార్థులలో శారీరక, మానసిక వికాసానికి విశాలమైన ప్రత్యేక క్రీడా మైదానాలు, ఇండోర్, ఓపెన్ జిమ్ సౌకర్యం

-ఉన్నత విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల పట్ల టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, ఆర్ఆర్ బి, ఎస్ఎస్ సి, బ్యాంకింగ్, పవర్ సెక్టార్ మొదలైన వాటిలో అవగాహన కల్పించడానికి కెరీర్ గైడెన్స్ సెల్ ఉందన్నారు.

-సుశిక్షితులైన ఎన్సిసి అధికారుల పర్యవేక్షణలో విద్యార్థులకు శిక్షణ ఆర్డిసి,ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రతి ఏటా అధిక సంఖ్యలో విద్యార్థుల ఎంపిక ఎన్సిసి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ లో ఉద్యోగులుగా ఎంపిక.

-సామాజిక సేవ ద్వారా వ్యక్తిత్వ వికాసం కలిగించుటకు మూడు ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఏర్పాటు ఉన్నట్లు తెలిపారు.  ప్రతి ఏటా ప్రత్యేక శిబిరాలు నిర్వహణ, బాల, బాలికలకు ప్రత్యేక వసతిగృహ సౌకర్యం.

-ఉమెన్ ఎన్పవర్మెంట్ సెల్ ద్వారా విద్యార్థినులకు చట్టం,న్యాయం హక్కుల పట్ల అవగాహన కల్పించుట.

-అన్ని వర్గాల విద్యార్థులకు అన్ని రకాల స్కాలర్షిప్ తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం.

-కళాశాల ప్రాంగణం పూర్తిగా సీసీ కెమెరాలచే నిఘ, నిరంతర పర్యవేక్షణ.

-ఫలితాలు, విజయాలలో ప్రభంజనం సృష్టించి ఎంతోమంది ఉన్నత ఉద్యోగాలు, వృత్తి నిపుణులు గా, పారిశ్రామికవేత్తలుగా తయారుచేసిన చరిత్ర గల విద్యా సంస్థ  ఆర్ట్స్ అండ్ కళాశాల సొంతం. 

ఆధునిక బోధన, వర్చువల్ తరగతులు, ఈ- క్లాస్ రూమ్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్,అధునాతన వసతులతో  కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల విద్యార్థులే కాకుండా రాష్ట్ర నలుమూలల వివిధ జిల్లాల నుండి విద్యనభ్యసించి, ఖండాంతరాల్లో విద్యా కుసుమాలను వెదజల్లుతున్న ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కామారెడ్డి.