calender_icon.png 6 May, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం బ్యారేజీలను కూల్చింది..

05-05-2025 10:32:49 PM

సంచలన వ్యాఖ్యలు చేసిన నీటిపారుదల రంగానిపుణులు వి.ప్రకాష్..

మహాదేవపూర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కొరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చివేసిందని నీటిపారుదల రంగా నిపుణులు వి. ప్రకాష్ ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో గోదావరి తీరంలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు-వాస్తవాలపై చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని బ్యారేజీలు కూలీపోవాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆశయం, ఆలోచన, ఆచరణ అని నీటి పారుదల రంగ నిపుణులు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బారాజ్‌ కుంగిపోవడంపై ఎవరికి అనుమానాలు లేకున్నా తనకు మాత్రం అనుమానం ఉందని, అధికారం కోసం ఏదైనా చేసే నైజం సీఎం ది అని ఆయన ఆరోపించారు.

ఎన్నికలకు ముందే మేడిగడ్డ బరాజ్‌లో పియర్ కుంగిపోవాలా, అందుకు బారీ శబ్దం రావడం ఏంటని ప్రశ్నించారు. ఈ శబ్దం రెండు కిలోమీటర్ల వరకు వినబడిందని స్వయంగా మేడిగడ్డ పర్యవేక్షణ అధికారి ఏఈ మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఆ విచారణ జరగలేదని ఎవరు ఈ ప్రాజెక్టును పేల్చివేశారు తెలుపలేదన్నారు. అంతేకాకుండా ఎన్‌ డీ ఎస్‌ ఏ బృందం వచ్చి పరిశీలన చేసి ఆనాడు ఏం చెప్పారో మళ్లీ 18నెలల తర్వాత అదే చెప్పారని, ఆనాడు ఈనాడు నిపుణులను పెట్టి కారణాలు అన్వేషించాలని నివేదికలో పేర్కొనడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణపై నీటి విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. 2014 వరకు కేవలం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు మాత్రమే ఉండేదని, మేడిగడ్డ నిర్మాణం జరిగే వరకు 500 కిలోమీటర్ల గోదావరి నదిపై  5 7ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు ప్రాజెక్టుకు నిర్మించలేదన్నారు.

టీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు దేవాదుల ప్రాజెక్టును మొదలు పెట్టాడన్నారు. కేవలం ఆంద్రాప్రాంతానికి నీళ్లు తరలించేందుకే అనేక కుట్రలు జరిగాయని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్ర వచ్చే వరకు సమైఖ్యపాలనతో ఎక్కడా ఒక్క చెరువు పూడిక తీయకపోవడం సైతం కుట్రనే అని తెలిపారు. మన ప్రాంతంలోని చెరువులు నిండి తెగితేనే ఆంద్ర ప్రాంతంలోని పంటలకు సాగునీరు అందుతుందనే విషయం ఎవరికి తెలియదన్నారు. 2014 వరకు బారీ వర్షాలు కురిస్తే  అనేక చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయనే వార్తలు వినే వాళ్లమని ఆయన గుర్తు చేశారు. ఇలా సాగునీటి కోసమే తెలంగాణకు అన్యాయం చేసుకుంటూ వచ్చారని, మళ్లీ ఈనాడు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సైతం అదే కుట్రలు చేస్తున్నారని ఆయన వివరించారు.

అనంతరం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. 16 నెలల క్రితం వరకు కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అని కేసిఆర్ అంటేనే కాళేశ్వరం ప్రాజెక్టు అనీ గొప్ప పేరు ఉన్న క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రాజెక్ట్ విషయంలో అవకాశం దొరికిందని అనేక దుష్ప్రచారాలు చేస్తూ  ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేశారని మాజీ మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవా విషయాలు దూరంగా ఆవాస్తవాలను ప్రచారం చేయడం కోసం పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఇలాంటి అవాస్తవలకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని ఈ ప్రాజెక్టు నిర్మించిన చరిత్ర కేసీఆర్ దీ అని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాలకు నీళ్లు అందించామని నల్గొండ, ఖమ్మం, మెదక్, జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు సస్యశ్యామలం చేశాయని గుర్తు చేశారు.

అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్  కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ లక్ష కోట్లు దోచుకున్నారు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోని ఒక పియర్ కుంగిపోయి పక్కనే ఉన్న పియర్స్ పై భారంపడింది అని దీంతో మొత్తం ప్రాజెక్టు కూలిపోయింది, అనీ కాంగ్రెస్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. ప్రాజెక్టును సందర్శించిన ఎన్ డి ఎస్ ఏ బృందం ఏడాది తర్వాత నివేదిక ఇచ్చిందని ఈ నివేదికలో పిల్లలకు మరమ్మత్తు చేసి నీళ్లను అపవచ్చని పేర్కొందని ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని చెప్పలేదు అన్నారు. చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించి ప్రజలను నమ్మించి కుట్ర చేస్తున్నానని కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అనంతరం మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలను పటాపంచలు చేయాలని ఆలోచనతో ఈ చర్చ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. సమైక్యాంధ్ర పాలనలో వలసదారుల వలసవాదులు తెలంగాణకు దక్కాల్సిన నీళ్ల వాటను తరలించకపోయి అన్ని రకాల అభివృద్ధి చెందిన మనపైనే పెత్తనం చెలాయించారని అన్నారు. 1956 నుంచి 2014 వరకు అనేక ఏళ్ళు కాంగ్రెస్ పాలల్లో తెలంగాణ సమస్యలకు కార్ఖానగా తయారైందని ఈ క్రమంలో తెలంగాణ సాధన, సమస్యలకు పరిష్కారం కొరకు మన ఉద్యమ నేత కేసీఆర్ ఆలోచనే తెలంగాణ అని అన్నారు.

సమైక్యాంధ్ర పాలనలో నీళ్లు, నియామకాలు, నిధులు దోపిడీ జరిగిందని నీళ్ల సమస్యతోనే తెలంగాణకు మేలు జరుగుతుందని దిశగా అడుగులు వేసామని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముందుగా నీళ్లు కొరకు అపార జల రాశులు ఉన్న తెలంగాణ నీటి కోసం పడుతున్న గోస విషయంలో కాకతీయులను ఆదర్శంగా తీసుకున్న కేసిఆర్ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేశారన్నారు. పదేళ్లపాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి ప్రయోజనాలు పొందామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రాజెక్టులు నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేస్తున్నారు.

సాగునీటి రంగంలో అపురూపమైన ప్రగతిని చూసినా కాంగ్రెస్ ఆ ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రజలను నమ్మించే కుట్రలు చేశారని అద్భుత ప్రాజెక్టును వక్రీకరించి అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి తెలంగాణ ముఖ్యమంత్రి ఏజెంట్ అనే విషయం అందరికీ తెలిసిందానని ఇద్దరి సీఎంలో సమిష్టి ప్రయోజనాల కోసం ఈ ప్రాంత ప్రయోజనాలు ఆంధ్రకు తాకట్టు పెట్టి ప్రయోజనం పొందేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనంతరం మంతిని మాజీ శాసనసభ్యుడు పుట్ట మధుకర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ నమ్మిన వాళ్లును నట్టేట ముంచిందని మేనిఫెస్టో కమిటీ చైర్మెన్ ఉన్న ప్రస్తుత మంథని ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ప్రజలకు మేలు చేస్తాడని చూస్తే నట్టేట ముంచిన చరిత్ర మంత్రి దేనానీ విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులను తొలగిస్తామని, వృద్ధులకు, వితంతువులకు 4000, వికలాంగులకు 6000, పింఛన్ ఇస్తామని మహిళలకు నెలకు 2500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అమలు చేయడం లేదని కాళేశ్వరంలో ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించేలా మేనిఫెస్టో తయారుచేసి అమలు చేస్తామనే ప్రజలను, రైతులను నమ్మించి మోసం చేశాడని అన్నారు. నిత్యం ముఖ్యమంత్రి ప్రక్కనే కూర్చుంటూ మంత్రి ఏం చెప్పినా చేస్తానని సీఎం చెప్తున్నా ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే  మంతిని నియోజకవర్గం ప్రజలను వాడుకుంటున్నారని మంత్రిపై ఆరోపణలు చేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తానని చెప్పి ఈనాడు పంటలు సాగు చేసే భూములను లాక్కొని కాలువలు తవ్వుతున్నారని మంచి దిగుబడిచే పంటలను కాదని తాము పంటలు సాగు చేసుకోవద్దని పోలీసులతో హుక్కుమ్ జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చిన్న కాళేశ్వరం భూసేకరణ ఆపివేసి గ్రామసభల ద్వారా పరిశీల పనులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలపై ప్రజలు గమనించి ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, నడిపెల్లి దివాకర్ రావు, కోరు కంటి చందర్, దుర్గం చిన్నయ్య, మాజీ జడ్పీ చైర్ పర్సన్ లు దావ వసంత, జక్కు శ్రీహర్షిని తదితరులు పాల్గొన్నారు.