calender_icon.png 6 May, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తరిగొప్పులలో బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన..

05-05-2025 11:21:15 PM

తరిగొప్పుల (విజయక్రాంతి): జనగామ జిల్లా తరిగొప్పుల మండలం వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి 10 గంటల నుండి దాదాపు రెండు గంటల పాటు ఈదురుగాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలుల వీచడంతో చెట్లు కూలిపోయాయి. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లారీలో వేసిన ధాన్యం బస్తాలు తడిసి ముద్దయినాయి. చేతికొచ్చిన వరి పంటలు నేలవాలాయి, మామిడి కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో కురిసిన వడగండ్ల వానకు చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు.