calender_icon.png 6 May, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నతంగా ఆలోచించి, ఉన్నత శిఖరాలను అధిరోహించండి

05-05-2025 10:58:20 PM

ఖమ్మం (విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నతంగా ఆలోచించి... విద్యతో పాటు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్(District Collector Muzammil Khan) అన్నారు. ఇటీవల పదో తరగతి పరీక్షా ఫలితాలలో వెలువడిన స్టేట్ టాఫర్స్ లతో జిల్లా కలెక్టర్ కాసేపు ముచ్చటించారు. భవిష్యత్ లో  మీరు.. ఏమీ కావాలనుకుంటున్నారని జిల్లా కలెక్టర్ వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మీరు ఎంతగానో శ్రమ చేస్తే కానీ ఈ స్థాయికి రావడం జరిగిందని, ప్రస్తుతం విద్యలో వెనుకబడిన విద్యార్థులకు విద్యా మెళకువలను.. నేర్పుతూ ఐదుగురు విద్యార్థులను చైతన్యవంతులను చేసి మరల తన వద్దకు వచ్చి ఆ ఐదుగురిని స్టూడెంట్స్ ను తనకు చూపాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజను మీరు ఆదర్శంగా తీసుకొని విద్యా రంగంలో మరింత ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థలో తాము సభ్యత్వం పొందామని, తమను విష్ చేయండి... బ్లెస్ చేయండి... గైడ్ చేయండి... మీరే... మాకు.. రోల్ మోడల్... అంటూ... జిల్లా కలెక్టర్ తో విద్యార్థులు సంభాషించారు. విద్యార్థుల సంభాషణలకు జిల్లా కలెక్టర్ మంత్ర ముగ్ధులయ్యారు. ఏ.రంగంలో నైనా కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటేనే సాధ్యమవుతుందని, మీరు కన్న కలలను సహకారం చేసుకునేందుకు శ్రమించాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ముగ్గురు టాపర్స్ భువన శ్రీ,  శిరీష, శ్రీజలను శాలువాతో సత్కరించి వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, రాజ్యాంగ పరిరక్షణ వేదిక పాలేరు నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ నజీర్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.