calender_icon.png 19 August, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్‌తో ఉపాధి అవకాశాలు

19-08-2025 01:29:27 AM

ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, ఆగస్టు 18 (విజయ క్రాంతి): నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జగిత్యాల ఎమ్మెల్యే డా . సంజయ్ కుమార్ అ న్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐ టి ఐ అడ్వానస్డ్ టె క్నికల్ సెంటర్ ప్రవేశాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏటీసీ లో ఫస్ట్ ఫేస్, సెకండ్ ఫేస్ లో భర్తీ కాకుండా మిగిలిన సీట్లకోసం విద్యార్థులు నేరుగా ఏ టిసిలో కలిసి ఖాళీ సీట్లను పొందే అవకాశం ఉందన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ లైబ్రరీ డైరెక్టర్ చేట్పల్లి సుధాకర్ ,ఐటిఐ ప్రిన్సిపల్ రవీందర్, కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.