calender_icon.png 19 August, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాదారులపై చర్యలు తీసుకోండి

19-08-2025 01:32:23 AM

తహసీల్దార్‌కు వినతి చేసిన ఎస్హెచ్జి సభ్యులు 

జైపూర్: మండల కేంద్రంలోని ఐకెపి మహిళలకు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్హెచ్జి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం సుమారు 300 మంది స్వయం సహాయక సంఘాల మహిళ సభ్యులు తహసీల్దార్ కి వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు.

గతంలో మహిళల సమావేశాల కోసం అప్పటి ఎమ్మెల్యే ఆదేశాలతో తహసీల్దార్ గ్రామ సంఘానికి సర్వే నంబర్ 152లో స్థలం కేటాయించారని, కానీ కొందరు నాయకులు, స్థానికేతరులు దానిని ఆక్రమించి 10 గుంటల చొప్పున ఆక్రమించి బంధువులకు విక్రయించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తూ, మహిళల వినతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జైపూర్ గ్రామ సంఘ స్థలంలోనే మహిళా ఇందిరా భవన్ నిర్మాణం చేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలని మహిళా సంఘాలు విజ్ఞప్తి చేశాయి.