19-08-2025 01:30:40 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 18 (విజయక్రాంతి): నగర పౌరుల నుంచి సమస్య లను నేరుగా స్వీకరించి, వాటిని తక్షణం పరిష్కరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నిర్వహిసు ్తన్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు, ఆరు జోన్ల పరిధిలో కలిపి ప్రజల నుంచి పలు సమస్యలపై మొత్తం 152 ఫిర్యాదులు ఉన్నతాధి కారులకు అందాయి.
జోన్ల వారీగా ఫిర్యాదుల వివరాలు..
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 55 అర్జీలు వచ్చాయి. అలాగే ఆరు జోన్ల పరిధిలో 97 దరఖాస్తులు రాగా, వాటిలో అత్యధికంగా కూకట్‌పల్లి జోన్‌లో 44 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో సికింద్రాబాద్ జోన్, శేరిలింగంపల్లి జోన్‌లలో చెరో 18, ఎల్బీనగర్ జోన్‌లో 8, చార్మినార్ జోన్‌లో 7, ఖైరతాబాద్ జోన్‌లో 2 చొప్పున ఫిర్యాదులు స్వీక రించినట్లు అధికారులు వెల్లడించారు.
తక్షణ పరిష్కారానికి ఆదేశాలు..
ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఉన్నతాధికారులు, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సమస్యల ప్రాధాన్యతను బట్టి, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధి త విభాగాల అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, రెవెన్యూ వంటి పలు విభాగాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు విన్నవించుకు న్నట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఈ సహదేవ్ రత్నాకర్, అదనపు కమిషన ర్లు వేణుగోపాల్, సత్యనారాయణ, పంకజ, మంగతాయారు, సుభద్ర పాల్గొన్నారు.