10-10-2025 01:02:14 AM
నాగర్ కర్నూల్ అక్టోబర్ 9 (విజయక్రాంతి)విద్యుత్ షాక్కు గురై ఓ కౌలు రైతు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం అల్లాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గురుస్వామి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కేశ భరత్(31) అదే గ్రామంలో 30 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు.
రోజులాగే వ్యవసాయ పొలానికి వెళ్తుండగా వర్షం కారణంగా విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న విద్యుత్ వైర్ ను తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆలస్యంగా గమనించిన కుటుంబీకులు అక్కడికి వెళ్లి చూసేల్లోగా మృతి చెందిపడి ఉన్నాడు. మృతుడి భార్య సంతోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు.