22-07-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, జులై 21, (విజయ క్రాంతి) కాలీ జాగా... వేసే కంటైనర్, మున్సిపల్ రో డ్డు అయినా, మురికి కాలవలైన దర్జాగా ఆక్రమించు అక్రమ నిర్మాణాలు నిర్మించు అన్నట్లు ఉంది కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పా ల్వంచ డివిజన్ పరిధిలోని పాల్వంచ పట్టణం. మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలను, మురికి కాలువలను, అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన పట్టణ ప్ర ణాళిక అధికారులు నాలుగు గోడలు దాటి బయటకు వచ్చిన దాఖలాలు లేవు.
కిందిస్థాయి సి బ్బందిని క్షేత్రస్థాయికి పంపి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య, విలువ గల భూముల ఆక్రమణ యదేచ్చగా సా గుతోంది. పాల్వంచ పోలీస్ స్టేషన్ బంక్ ఎదురుగా పార్ధు జెరాక్స్ పక్కన అక్రమంగా కంటైనర్ ఏర్పాటు చేశారని పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకు న్న దాఖలాలు లేవు. స్పుసై ఫ్యామిలీ రెస్టారెంట్ వెనుక భాగంలో మున్సిపల్ డ్రైనేజీ ఆక్రమించి భారీ స్థాయిలో షెడ్డు నిర్మాణం జరిగిన, పలుమార్లు పత్రికలో ప్రచురించిన పట్టణ ప్రణాళిక అ ధికారులు మన్నుదిన పాముల వ్య వహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవి కేవలం మ చ్చుతునకలు మాత్రమే. అనుమతులేని భవనాలు, అనుమతులకు మించి నిర్మిస్తున్న భవనాలు కోకోలలు ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. రెండు రోజుల క్రితం పాల్వంచ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల తోనైనా అధికారుల్లో చలనం వచ్చేనా అని పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.