calender_icon.png 23 July, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.150 కోట్లతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ పనులు

22-07-2025 12:00:00 AM

  1. పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల

సంక్రాంతి నాటికి పూర్తి చేయాలి

ఖమ్మం, జులై 21(విజయ క్రాంతి): 150 కోట్లతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికరణకు జరుగుతున్న పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు ఆధునికరణ లో భాగంగా చేపడుతున్న పనుల వివరాలను మంత్రికి వివరించారు. మార్కెట్కు మొత్తం ఆరు గేట్లను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

మార్కెట్కు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూడాలని తెలిపారు. సంక్రాంతి నాటికి ఆధునికరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ విస్తరణలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి స్థలాలు ఇస్తామని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.

మార్కెట్ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని ఇక్కడకు వచ్చే రైతులకి ఒక మంచి గుర్తుగా ఉండాలి, కాని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. నాణ్యతలో ఎక్కడ రాజీ పడకూడదని ఎటువంటి తేడా వచ్చిన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.