calender_icon.png 22 October, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధులు, నిరక్షరాస్యులే టార్గెట్

22-10-2025 12:16:55 AM

- ఏటీఎం కార్డుల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్థుడి అరెస్ట్

- ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

- మీడియా సమావేశంలో డిసిపి సునీతరెడ్డి వివరాలు వెల్లడి

- నిందితుడి నుంచి రూ.6లక్షల 31వేల నగదు,  బ్రీజా కారు, 23 ఏటీఎం కార్డులు స్వాధీనం 

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 21: ఏటీఎం సెంటర్ ల వద్ద వృద్ధులు, నిరక్షరాస్యత గల అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ వారి దృష్టి మరల్చి ఏటీఎం కార్డుల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్థుడి పోలీసు లు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా.. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మహేశ్వరం జోన్ డిసిపి సునీత రెడ్డి వివరాలు వెల్లడించారు.

అబ్దుల్లాపుర్మెట్ మండలం, తుర్క యంజాల్, జన చైతన్య కాలనీకి చెందిన మోహన్ రావు జోషి (38) ఈనెల 11వ తేదీన తుర్కయంజాల్ లోనీ ఎస్బిఐ ఎటిఎం కు వెళ్లి నగదు తీసుకునేందుకు నిందితుడైన, పరిచయం లేని, సుధనాబోయన వెంకటేష్ సహాయంతో ఏటీఎం స్వుప్ చేశారు. అనంతరం బాధితుడైన మోహన్ రావు ఈనెల 15న బ్యాంకుకు వెళ్లి ఖాతాను తనిఖీ చేసి చూడగా, ఖాతా నుండి రూ.40,000/- డెబిట్ కావడమే కాకుండా, అతని ఏటీఎం కార్డుకు బదులు వేరే కార్డు ఇచ్చినట్లు గుర్తించాడు.

కాగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, నేరస్తుడినీ ఎట్టకేలకు అరెస్టు చేశారు. నేరస్తుడైన వ్యక్తి సూర్యపేటకు చెందిన సుధనాబో యన వెంకటేష్ (37), వృత్తి కారు డ్రైవర్. గత కొంతకాలంగా నాగారం, ఇస్మాయిల్ గూడ లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. రాచకొండ కమిషనర్ రేట్ పరిధిలో వివిధ ఏటీఎం సెంటర్ లలో ప్రజల దృష్టి మరల్చి డబ్బులను డ్రా చేస్తున్న నెరస్థున్ని ఆదిభట్ల పోలీసులు తుర్కయంజాల్ లోని ఎస్‌బిఐ బ్యాంక్ సమీపంలో నేరస్థుడిని అరెస్టు చేశారు.

గతంలో కూడా ఇతడి పై రాష్ర్టంలో పలు ప్రాంతాలైన సూర్యాపేట, ఖమ్మం 26 కేసులు ఉన్నాయని, 2021 నుండి 27 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులను టార్గె ట్ చేసి ఏటీఎంకు వచ్చిన వారు మిషన్లో పిన్ ఎంట్రీ చేస్తుండగా చూసి, సహాయం అందిస్తున్నట్లు నటించి, అట్టి ఏటీఎం లను దొంగిలించి, అందులో నగదు కాజేస్తాడు. అంతేకాకుండా కార్డు స్వుప్ చేయడం రానివారికి స్వుప్ చేసి నకిలీ, పనిచేయని కార్డులను మార్చి ఇస్తుంటాడు.

ఇతడిపై సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్ కమిషనరేట్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. 2021 సంవత్సరంలో చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యాడు. అప్పటికి తీరు మారకపోవడంతో పీడీ యాక్ట్ కు పెట్టడం జరిగిందని తెలిపారు. మరల ఏటీఎం సెంటర్ ల వద్ద అనుమాస్పదంగా తిరుగుతున్న నిదింతుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపి నిందితుడిని రిమాండ్ కు తరలించడం జరిగిందని డిసిపి తెలిపారు. 

నిందితుడి నుండి రూ.6లక్షల 31వేల నగదు, ఒక సెల్ ఫోన్, వివిధ బ్యాంక్ లకు చెందిన 23 ఏటీఎం కార్డులు, ఒక బ్రీజా కారు స్వాధీనం చేసుకొని నేరస్తుడిని రిమాం డ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నందుకు గాను డిసిపి సునీత రెడ్డి, ఏసిపి కెపీవి రాజు లు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ సిఐ రవికుమార్, ఎస్సులు, సిబ్బందినీ అభినందించారు.