calender_icon.png 11 September, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయటపడ్డ ఆక్రమాలు

09-09-2025 12:58:42 AM

  1. ప్రజావేదిక సాక్షిగా అనేక గోల్‌మాలను బయట పెట్టిన తనిఖీ బృందం 
  2. మరణించిన వారిపై పేమెంట్లు 
  3. చర్యలు తీసుకోని డీఆర్‌డీఓ 

సిర్పూర్ యు, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): 2024 సమసత్సరంలో ఎన్‌ఆర్ జీఎస్ ద్వారా చేపట్టిన పనుల పై గత వారం రోజులుగా సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ ఆశంపై సోమవారం మండల కేంద్రంలోని ఎంపిడీఓ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు.

అయితే అధికారులు సమాచారం ఇవ్వకపోవడం వలన కూడా ప్రజలు పాల్గొన లేదు. కేవలం పంచాయతీ కార్యదర్శులు ఆడిట్ బృందం మాత్రమే పాల్గొన్నారు. అయితే ప్రజావేదిక తీరు విచిత్రంగా కొనసాగింది.

ఆడిట్ బృందం వివరించిన ఆంశాలు 

తమ తనిఖీలో తేలిన అనేక అంశాలను ప్రజలు లేని ప్రజావేదిక వేలాదించారు. ముక్యంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అయిదుగురు వ్యక్తులు చనిపో యినప్పటికి వారు ఉపాధి పనులు చేస్తున్న ట్లు పేమెంట్లు జరుగుతున్నాయి. మండలంలోని 15 గ్రామపంచాయతీలలో ఒక వర్క్ నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. ప నుల కొలతల పొంతన లేదు.

పవర్ గూడా, సిర్పూర్ యు జీపీలలో మొత్తం 160 మంది ఉపాధి కూలీలు 30 రోజుల పాటు పనిచేసినట్లు పేమెంట్లు జరిగాయి. కానీ మాస్టర్ రోల్ లో వారి సంతకాలు గాని హాజరు గాని లేదు. సదరు కూలీలు తాము పనికి వెల్ల లేదని తెలిపారు.

బండేర్ గ్రామపంచాయతీ లో రెండు లక్షల రూపాయలకు చెందిన పనులను ఆడిట్ బృందానికి సిబ్బంది చూపించలేదు. ఒక గ్రామా పంచాయతీ లో కూడా రికార్డులు సంపూర్ణంగా లేవు. ఇలాం టి అనేక గోల్‌మాల్ విషయాలను ఆడిట్ బృందం వేలాదించారు.

డీఆర్‌డీఓ స్పందించి తీరు...

ఆడిట్ బృందంపై విషయాలను ప్రజావేదికలో వేలాదించారు. అయితే పై అంశాల కు డీఆర్‌డీఓ దత్తరాం సిబ్బందితో ఈ విదంగా స్పందించారు. ఏమయ్యా.. మనం చేస్తున్న పని మనం పూర్తి చేయకుంటే వేరే వాల్లు పూర్తి చేస్తారా. మనం రోజు కడుపు నిండ అన్నం తింటామ. రికార్డులు పూర్తి చేయకుంటే వెంటనే పూర్తి చేయండి మరో సారి తప్పు చేయకండి.

మొక్కలు చనిపోతే వాటి స్థానం లో మళ్ళీ మొక్కలు నాటండి ఇది ఆయన స్పందించిన తీరు అంతే తప్ప తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు లేవు.  గోల్ మాల్ అయిన నిధులు రికవరీ వ్రాయలేదని ఎంపీడీఓ కృష్ణారావ్ తెలిపారు. 2.61 కోట్ల మెటీరియల్ పనులకు చెందిన రికార్డులు తనిఖీ బృందానికి ఇవ్వక పోవడంపై ఎలాంటి ఊసు ఎత్తలేదు. 

చివరికి ఈజీఎస్ ఏపీఓ ముగింపు మాటలు మాట్లాడుతూ.. డీఆర్‌డీఓ.. సార్ మనవాడు కాబట్టి ఇన్ని తప్పిదాలు పడ్డప్పటికీ  క్షమించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మన సిబ్బంది మరో సారి ఇలాంటి తప్పులు చేయకుండా పని చేయాలి అంటూ సమావేశాని ముగించారు. ఈ మాటల  సారాం శం అనేక అనుమానాలకు తవిస్తున్నాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మార్కెట్  చేర్మెన్ కుడిమేత విశ్వనాథ్ పాల్గొన్నారు.