09-09-2025 12:57:32 AM
-రాష్ర్ట గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్
ముషీరాబాద్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): మరో గ్రంథాలయ ఉద్యమానికి మార్గం వేద్దామని రాష్ర్ట గ్రంధాలయం శాఖ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గ్రంథాలయ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, మరింత విస్తరించడం కోసం పుస్తకాలను మరింత చదవడం, పెంచడం కోసం ప్రజల్లో అక్షరాస్యతను విస్తరించడం కోసం పుస్తకాలను చదివే అలవాటును పెంచడం కోసం సోమవారం పుస్తక ప్రియులు, రచయితలు, పుస్తక ప్రేమికులు, గ్రంథాలయ ఉద్యోగులు బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ నుండి సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి వరకు “పుస్తకాలతో నడక- వాక్ విత్ బుక్స్” అనే కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ర్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ అక్షరం ఒంటరిగా ఉన్న మనిషికి ప్రపంచాన్ని పరిచయం చేస్తుందన్నారు. సినీ దర్శ కులు నర్సింగరావు, ప్రముఖ రచయిత వే ణుగోపాల్, యాకూబ్, ఆయాచితం చిత్రం శ్రీధర్, ప్రభాకర్, విజయలక్ష్మి రవికుమార్, గ్రంథాలయ సిబ్బందిపాల్గొన్నారు.