calender_icon.png 12 January, 2026 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాలలో ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి

12-01-2026 03:12:53 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ లేకపోవడంతో ప్రజలు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానికంగా ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నహీం పాషా అన్నారు.

సోమ వారం మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ సూపరింటెండెంట్ విశ్వేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోనే ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు సమయ, ఆర్థిక భారాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.