12-01-2026 02:56:01 PM
చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని దమగ్నాపూర్ గ్రామంలో సోమవారం రోజున ఎమ్మెల్యే స్వగృహం నందు విజయ క్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సరములు మరింతగా పాఠకులకు అండగా ఉంటూ ప్రభుత్వానికి వారధిగా నిలబడుతూ ముందుకు సాగాలని కోరారు. విజయ క్రాంతి దినపత్రిక తక్కువ సమయంలోనే అత్యధికంగా జనాదరణ పొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ క్రాంతి రిపోర్టర్ శివకుమార్, దేవరకద్ర మాజీ యూత్ అధ్యక్షుడు ఎస్ వెంకటేష్, ఎస్ శేఖర్,ఎండి సేరిగౌస్, తదితరులు పాల్గొన్నారు.