calender_icon.png 12 January, 2026 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవభక్తి సన్మార్గం వైపు నడిపిస్తుంది

12-01-2026 03:07:41 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): దైవభక్తి సన్మార్గం వైపు నడిపిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలోని 37వ డివిజన్ సద్దలగుండులో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ముడా నిధులు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన షెడ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ నిర్వాహకులు, భక్తులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా, సమాజాన్ని ఐక్యంగా నిలిపే సామాజిక ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ బాధ్యతగా భావిస్తూ, ముడా నిధులతో ఈ షెడ్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ షెడ్ ద్వారా వేసవి,వర్షాకాలాల్లో భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనాలు చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పంతో ఎస్బీఐ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభించారు. అనంతరం ముడా నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ స్వప్న, నాయకులు సీజే బెనహర్, సామ్యెల్ దాసరి, వెంకటాచారి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు పుల్లయ్య, రాములు, రాం కిషన్, శ్రీను, సాయిలు, సత్యనారాయణ, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.