21-09-2025 10:09:31 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని తిమ్మాపూర్ గ్రీన్ వుడ్ సిబిఎస్ఈ పాఠశాలలో ఆదివారం ముందస్తు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రమోహన్ మాట్లాడుతూ, దసరా పండుగ సందర్భంగా దేవి నవరాత్రులు, విజయదశమి వేడుకలను ప్రజలందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా నిర్వహించుకుంటారని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు, మహిళ ఉపాధ్యాయినిలు బతుకమ్మలను పేర్చి, ఆట పాటలతో బతుకమ్మలను కొలిచారు. అనంతరం పాఠశాల ఆవరణలో భారీ రావణాసురుని ప్రతిమను దహనం చేశారు. ఈసందర్భంగా పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, ప్రజలందరికీ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ భరద్వాజ నాయుడు, ఏజిఎం పవన్ కుమార్ లు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైన్ ప్రిన్సిపాల్ తిరుపతి, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.