calender_icon.png 21 September, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవిందాపూర్‌లో చిత్తు బొత్తు ఆటగాళ్ల అరెస్ట్

21-09-2025 10:07:53 PM

దౌల్తాబాద్: మండల పరిధిలోని గోవిందాపూర్ గ్రామంలో పోలీసులు చిత్తు బొత్తు ఆటగాళ్లను పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు తెల్లవారుజామున ఎస్సై అరుణ్‌కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేసి జూదంలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో చిత్తు బొత్తు ఆట కొనసాగుతోందనే సమాచారంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి, వారిని గజ్వేల్ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఇకపై ఇలాంటి అక్రమ జూదాలు మండలంలో ఎక్కడా జరగనివ్వబోమని ఎస్సై అరుణ్‌ కుమార్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.