calender_icon.png 22 January, 2026 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

22-01-2026 05:34:37 PM

గర్రెపల్లి సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్

సుల్తానాబాద్, జనవరి 22 (విజయ క్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయనీ సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో సీఎం కప్ యూత్ వాలీబాల్ క్రీడలను గురువారం గ్రామ సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ నవీన్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా  సర్పంచ్ వీరగోని రమేష్ మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు క్రీడల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.  ఆరోగ్యకరమైన భావి భారత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం  కవిత, వ్యాయామ ఉపాధ్యాయురాలు  ఆసియా బేగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.