calender_icon.png 28 November, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఇంగ్లీష్ ఒలంపియాడ్ టెస్ట్: ఎంఈవో నాగారం శ్రీనివాస్

27-11-2025 09:55:38 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ కేంద్రంలో టీజీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో గురువారం సిర్గాపూర్ హైస్కూల్లో ఇంగ్లిష్ ఒలంపియాడ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈవో నాగారం శ్రీనివాస్ ప్రారంభించి అవగాహన కల్పించారు. మండలంలోని సిర్గాపూర్, కడపల్, వాసర్ స్కూల్ కాంప్లెక్స్ విద్యార్థులు ఇద్దరు చొప్పున మొత్తం ఆరు మంది ఈ పరీక్షను రాశారు. ఇందులో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు మహేందర్, నాగయ్య, రమ్య, రవికుమార్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.