calender_icon.png 28 November, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీటెక్ విద్యార్థిని అదృశ్యం

27-11-2025 10:14:47 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): బీటెక్ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదులాబాద్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల దీక్షిత(21) సంస్కృతి కళాశాలలో బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నది. ఈ అమ్మాయి రోజు మాదిరిగానే ఇంట్లో రాత్రి పడుకున్నది. గురువారం ఉదయం 5 గంటలకు తండ్రి ఆనంద్ లేచి చూసేసరికి కనిపించకుండా పోయింది. ఆమె ఎవరికీ తెలియజేయకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది.

ఆమె ఫోన్ కి కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. పొరుగువారు, బంధువులతో సహా చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికిన కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఇట్టి విషయంలో తన తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పిపోయిన మహిళ ఎత్తు 4.9 అడుగులు, రంగు: తెలుపు, తప్పిపోయిన సమయంలో ధరించిన దుస్తులు పింక్ కలర్ టాప్, తెలుపు రంగు ప్యాంటు. ఈ అమ్మాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఘట్ కేసర్ పోలీసులకు తెలియజేయవలసిందిగా కోరారు.