27-11-2025 09:53:45 PM
గ్రామ పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలి..
ఒంటెద్దు నరసింహారెడ్డి
గరిడేపల్లి (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సర్పంచి ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి అవినీతి కాంగ్రెస్ పై ప్రజలకు వివరించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి అవినీతి మీద ఉన్న దృష్టి పరిపాలన మీద లేదని విమర్శించారు.
తెలంగాణ వ్యతిరేకి మోడీ, తెలంగాణకు శాశ్వత వ్యతిరేకి చంద్రబాబు, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి,ముగ్గురు కలిసి నీటి మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న తెలంగాణ వ్యతిరేక పనులను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని సరైన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మండలంలోని 33 గ్రామ పంచాయతీలలో ఐదు గ్రామపంచాయతీలకు చెందిన అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిపారు. మండలంలోని కుతుభిషాపరం, ఎల్బీనగర్, రామచంద్రపురం, కోదండ రామపురం, కొండాయిగూడెంలో సర్పంచ్ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి,కే ఎల్ ఎన్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి,మాజీ మండల రైతు సమితి అధ్యక్షులు మాశెట్టి శ్రీహరి,మండల అధికార ప్రతినిధి రామ్ సైదులు,పెండెం వీరయ్య గౌడ్,పెండెం వెంకట రాములు గౌడ్,మాజీ సర్పంచ్ లు రామారావు,కర్నాటి నాగిరెడ్డి,బానోతు వెంకటేశ్వర్లు,నల్లపాటి భాస్కర్,బొలిశెట్టి సుధీర్,పంగ వీరస్వామి,మండల నాయకులు కుక్కునూరు అంజయ్య,రేవూరి వీరస్వామి,తెల్లబాటి నరేష్,మాజీ ఎంపీటీసీలు కడియం స్వప్న,స్రవంతి శోభన్ బాబు,ఎల్లావుల వెంకటేశ్వర్లు,కడప ఇసాక్,సింగిల్ విండో డైరెక్టర్లు హేమ్లా నాయక్,పెండెం ధనయ్య గౌడ్,నట్టే సైదయ్య,బండ వెంకట నర్సిరెడ్డి, సందీప్ నాయక్, సతీష్ రెడ్డి, షేక్ గులాం, కానుగు నగేష్, బండ్ల గోపాల్, చిట్యాల లింగయ్య, పిట్ట నరసయ్య, సతీష్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.