27-11-2025 10:05:19 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సహకార సంఘం కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్..
మంథని (విజయక్రాంతి): ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని సహకార సంఘం కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ రైతులకు సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధి మండలంలోని ఖాన్ సాయి పేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ ఆదేశాల మేరకు సహకార సంఘం కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ సంఘ డైరెక్టర్లు, రైతులు, హమలిలు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార సంఘం కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర రూ.2389, సాధారణ రకానికి రూ.2369 ధర, సన్న రకానికి క్విoటాల్ కు అదనంగా రూ.500 బోనస్ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అన్నారు.
17శాతం తేమ కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలిoచాలని అన్నారు. ధాన్యం కేంద్రం లో ఎప్పటికప్పుడు రికార్డులు నిర్వహించాలని, రైతుల నుంచి పట్టాదారు పాసు పుస్తకం, ఆదార్, బ్యాంకు ఆకౌంట్ జీరాక్స్ ప్రతులు తీసుకొని ధాన్యం వివరాలు ట్యాబ్ లో నమోదు చేయాలని ట్యాబ్ ఆపరేటర్లు, ఇంచార్జీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ పెద్దిరాజు ప్రభాకర్, నాయకులు కుడుదుల కోటయ్య, మహాదేవ్, సంఘ సిబ్బంది, రైతులు, హమలిలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.