27-11-2025 10:16:51 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): ఈ వార్షిక సంవత్సరం 2025-26 లో కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్, నిర్వహణ కొత్తగూడెం ఏరియాలో నిర్వహించనున్నారు. అందులో భాగంగా గురువారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు ఆధ్వర్యంలో, జిఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ జి.వి కిరణ్ కుమార్ తో కలిసి, కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొనుటకు వచ్చిన టీం మేనేజర్స్లతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొనాలని, తగు జాగ్రత్తలు తీసుకుంటూ క్రీడలను ఆడాలని తెలియజేశారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా టీం మేనేజర్స్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిఎంతో పాటు, జిఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ జి.వి కిరణ్ కుమార్, ఎస్ఓటు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఎజిఎం(సివిల్) సిహెచ్. రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, స్పోర్ట్స్ సూపర్వైజర్స్ ఎంసి. పాస్నెట్, జాన్ వెస్లీ, సిహెచ్. అశోక్, పరసా శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.