27-11-2025 09:57:57 PM
తరిగొప్పుల (విజయక్రాంతి): మండలంలోని మాన్సింగ్ తండా గ్రామానికి చెందిన కత్తుల కొమురయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని అలాగే దుర్గమ్మ గుడి కోసం రెండు గంటల భూమిని విరాళంగా రాసిస్తానని రాతపూర్వకంగా రాసి ఇవ్వడం వలన ఈ రోజు గ్రామస్తులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఆరుగురు వార్డ్ మెంబర్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఒకటవ వార్డు మెంబెర్ లకావత్ దసురు, రెండవ వార్డ్ మెంబర్ బానోతు కవిత, మూడవ వార్డు మెంబర్ పేరు లాకావత్ అమిత, నాలుగో వార్డ్ మెంబర్ లాకావత్ రవి, నునవత్ శ్రీకాంత్, ఆరో వార్డు మెంబర్ భూక్య శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.