calender_icon.png 19 January, 2026 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

10-11-2024 06:25:11 PM

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ లోని శిల్పారామంలో వారంతపు సంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం కర్ణాటక గాత్ర కచేరి వారి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. శ్రీనిధి తన కచేరీలో భజమానస, రామ, తిరుమల దాసు కీర్తన, స్వాతి తిరుణాల్ కీర్తనలు ఆలపించారు. వీరికి విజయలక్ష్మి మృదంగంపై వయోలిన్ పై కౌండిన్య పన్నాల సహకరించారు. జ్యోతి రెడ్డి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో దశరస గణపతిమ్, శ్లోకమలా, పుష్పాంజలి, శృంగారలహరి, సూర్యాష్టకం, భామాకలాపం, శివ పంచాక్షరీ, కృష్ణ శబ్దం, నారాయణ తీర్థుల తరంగం అంశాలను మిషిక, శ్రీ తావి, చిన్మయి, దేవాంశ, జశ్విత, ఐశ్వర్య, సాహితి, ప్రేగ్న్య వర్మ, తరిష్య రెడ్డి, వైష్ణో దేవి, సహస్ర, యోగదా,నికిత,వైష్ణవి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.