05-07-2025 07:39:10 PM
నిర్మల్,(విజయక్రాంతి): వనమహోత్సవాన్ని పురస్కరించుకుని సారంగాపూర్ మండలంలోని చించోలి గ్రామ పంచాయతీలో శనివారం సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇతర అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, మొక్కలు నాటడమే కాక, వాటిని పరిరక్షించడంలోనూ ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని పేర్కొన్నారు. మొక్కల సంరక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.