calender_icon.png 6 July, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంలో నిమ్స్ తరహాలో ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి

05-07-2025 07:38:59 PM

ప్రముఖ వైద్యులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, నున్నా నాగేశ్వరరావు..

ఖమ్మం (విజయక్రాంతి): మూడు రాష్ట్రాల నుంచి ఆరోగ్య చికిత్సల కోసం వేలాదిమంది పేదలు ఖమ్మం వస్తుంటారని, వారికి మెరుగైన వైద్యం కోసం నగరంలో హైదరాబాద్ నిమ్స్ తరహాలో నూతన హాస్పిటల్ నిర్మించాలని ఖమ్మం ప్రముఖ వైద్యులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు(CPM Party District Secretary Nunna Nageswara Rao) కోరారు. సిపిఎం పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ, బివికె కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరం మంచికంటి హల్ లో శనివారం జరిగిన ఉచిత మెడికల్ క్యాంపుకు వందలాది మంది పేషెంట్లు వచ్చారు. బిపి, షుగర్, చెవి ముక్కు,గొంతు, పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, నున్నా నాగేశ్వరరావు, మాట్లాడుతూ... గత ఎనిమిది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి నెల నెలా మెడికల్ క్యాంపు నిర్వహించడం నమ్మకమైన, నాణ్యతకు చిరునామాగా ఈ మెడికల్ క్యాంపు మారింది అని కొనియాడారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ పోస్ట్ లు చాలా ఖాళీగా వున్నాయని, గుండె పరీక్షలు నిర్వహించడానికి ఒక పర్మనెంట్ డాక్టర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కరణలు వేగంగా అభివృద్ధి చెందాయి అని ఈ నేపథ్యంలో నిమ్స్ తరహాలో హాస్పటల్ ను ఖమ్మంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ICU బెడ్లు సంఖ్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా తక్కువగా వున్నాయని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బెడ్స్ లేక ప్రయివేటు హాస్పిటల్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.

చుట్టుపక్కల వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వేలాది మంది పేషెంట్లు వస్తున్నారని, సౌకర్యాలు మరింత పెరిగేలా వైద్య సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. మెడికల్ క్యాంపుకు ప్రతి నెల నెలా తప్పకుండా టైం ఇస్తున్న ప్రముఖ డాక్టర్లు సి.భారవి, పిల్లలమర్రి సుబ్బారావు, జెట్ల.రంగారావు, జి.రాజేష్ వెంకటేశ్వర్లు, భాస్కర్, రమణా రెడ్డి తదితర డాక్టర్లకు మెమెంటో అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీనువాసురావు, మేనేజర్ వై.శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నరసింహారావు, సుధాకర్, శివనారాయణ, పి ఝాన్సీ, వాసిరెడ్డి వీరభద్రం, జె వెంకన్న బాబు, పి వాసు, అఫ్జల్, పి.కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.