11 August, 2026 | 1:24 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

డ్రగ్స్‌ నిర్మూలన మనందరి లక్ష్యం

24-06-2025 07:31 PM

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌..

హనుమకొండ (విజయక్రాంతి): డ్రగ్స్‌ రహిత వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్(Police Commissioner Sunpreet Singh) పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని డ్రగ్స్‌ కు వ్యతిరేకంగా, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్‌ పోస్టర్లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం అవిష్కరించారు.

ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. మత్తుపదార్థాలను ఈ సమాజం నుండి తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కపౌరుడు భాగస్వాములు కావడంతో పాటు పోలీసులుకు పూర్తి సహకారం అందించాలని, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, వాటి వినియోగించడం ద్వారా ప్రజలకు కలిగే నష్టాలను పోలీసుల వివరించడం జరుగుతోందని, ముఖ్యంగా ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో ఈ డ్రగ్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు, ర్యాలీలు, డ్రాయింగ్‌, వ్యాస రచన పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతొందని, ఎవరైన మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన తక్షణమే 8712584473 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని, సమచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమములో అదనపు డీసీపీ రవి, సిసిఆర్‌బి ఎసిపి డేవిడ్‌రాజు, ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గోన్నారు.