29 April, 2026 | 2:40 AM

డబిల్‌పూర్ శివాలయంలో నీటి సమస్యను తీర్చిన ఎర్రవెల్లి లతా దేవి

29-04-2026 01:07 AM

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 28(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్ పూర్ మున్సిపల్ పట్టణంలోని శివాలయంలో ఏర్పడిన నీటి సమస్యను తీర్చడానికి స్వర్గీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ ఎర్రవెల్లి శ్రీనివాస్ రెడ్డి సతీమణి ఎర్రవెల్లి లతా దేవి ఆయన స్మారకార్థం సింగల్ ఫేస్ మోటర్ తో పాటు వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎర్రవెల్లి విగ్నేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాలయం ఆలయానికి వచ్చే భక్తులకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలనే లక్ష్యంతో బైబిల్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డి సంజీవరావు 13వ వార్డు కౌన్సిలర్ లు ముత్యాల గౌడ్.విగ్నేశ్వర్ రెడ్డి.ఆరిఫ్ బాయ్ లు కలిసి బోర్ మోటార్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వీర్లపల్లి శ్రీరామ్ రెడ్డి.షేక్ సలీం.అక్రమ పాష.పి వెంకటేష్.ఎస్ మధుసూదన్.నర్సింగ్ గౌడ్.సాయి గౌడ్.సంజీవ.అశోక్.మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.