29 April, 2026 | 3:21 AM

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను జయప్రదం చేయండి

29-04-2026 01:08 AM

మఠంపల్లి, ఏప్రిల్ 28: ప్రపంచ కార్మిక పర్వ దినోత్సవం అయిన మేడేరు జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు మఠంపల్లి మండల సిపిఐ కార్యదర్శి అమరారపు పున్నయ్య విజ్ఞప్తి చేశారు.

మంగళవారం నాడు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో వారు పాత్రికేయులతో మాట్లాడుతూ కార్మిక శక్తిని యాజమాన్యాలు దోపిడీ చేసుకుంటున్న తరుణంలో రోజుకు 18 గంటలు పని చేయిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ కార్మికులు కుటుంబంతో కలిసి గడపడానికి వీలులేని పరిస్థితులు ఉన్న సందర్భంలో దోపిడీకి పీడనకు వ్యతిరేకంగా 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో మొట్టమొదటిసారిగా కార్మికులు సమ్మె చేస్తే ఆగ్రహించిన యాజమాన్యం కార్మికుల ఐక్యతను చెదరగొట్టేందుకు వారిపై విచక్షణా రహితంగా లాఠీచార్జీ జరిపి కాల్పులు జరిపి అనేక మంది ప్రాణాలు బలితీసుకున్నారని,అట్టి సందర్భంలో కాలువలై పారుతున్న కార్మిక రక్తంలో ముంచిన  జండానే మన ఎర్రజెండా అని వారు అన్నారు.