మంత్రి ఉత్తమ్‌పై నరసింహారెడ్డి ఆరోపణలు నిరాదారం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి
కోదాడ ఏప్రిల్ 28: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఒంటెద్దు నరసింహారెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమని కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం గుడిబండలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రక్షణలో సేవలందించి, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని, ఆయనపై అసత్య ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. నరసింహారెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో కోదాడ హుజూర్నగర్ లో తిరిగే ప్రసక్తే లేదని పార్టీ క్యాడర్ ఆగ్రహంతో ఉన్నదని అన్నారు. ఈ వ్యవహారంపై కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో నరసింహారెడ్డి పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈర్ల సీతారాం రెడ్డి, భాషబోయిన భాస్కరరావు, మందలపు శేషు, సర్పంచులు పాలకి సురేష్, బల్గురి స్నేహ దుర్గయ్య, మందుల నాగయ్య, హాజీ నాయక్, కన్నా రెడ్డి, జయసింహారెడ్డి, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.






